Varun-Luv Infinity: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ- లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒక్కటయ్యారు. హైటెక్స్‌లో రిసెప్షన్ రేపు జరగనుంది. కొత్త జంట హైదరాబాద్ చేరుకున్నారు. పెళ్లి రోజున లావణ్య త్రిపాఠి రెడ్ కలర్ కాంచిపురం చీర కట్టుకుంది. చాలా ట్రెడిషనల్‌గా అందులో కనిపించారు. ఆ చీరకో ప్రత్యేకత ఉంది.
అవును.. చీర మీద లావణ్య ఇద్దరి పేర్లను రాయించుకుంది. పూర్తి పేర్లు కాకుండా.. వరుణ్-లవ్ (Varun-Luv) అని వేయించుకుంది. దాని పక్కన్ ఇన్ఫినిటీ ( Infinity) సింబల్ కూడా ఉంది. ఇన్పినిటీ అంటే అనంతం.. వరుణ్- లావణ్య ప్రేమ అనంతం అనే ఉద్దేశంతో అలా రాయించుకుంది. ఆ పిక్ చూసి మెగా ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.
వరుణ్-లావణ్య ప్రేమించుకోగా.. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించారు. 1వ తేదీన ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. 5వ తేదీన (ఆదివారం) రిసెప్షన్ జరగనుంది. కొత్త జంటకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.