IT Raids: 5 రాష్ట్రాల ఎన్నికల వేళ ఐటీ, ఈడీ అధికారులు ముమ్మరంగా తనిఖీ చేపడుతున్నారు. తమకు వచ్చిన ఇన్ ఫుట్స్ ఆధారంగా సోదాలు చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో ఐటీ అధికారులు (IT Raids) ప్రత్యక్షం అయ్యారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారి, డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డి (Diwakar Reddy) ఇంట్లో సోదాలు చేశారు.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కారణంతో ఇళ్లు, ఆఫీసులు, అతని బంధువుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. తనిఖీ చేసే సమయంలో దివాకర్ రెడ్డితోపాటు అతని కుటుంబ సభ్యుల ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానం వచ్చిన పత్రాలను పరిశీలిస్తున్నారు.
ప్రకాశం రోడ్డులో గల పురంధర కాంప్లెక్స్‌లో గల డాలర్స్ గ్రూప్ కార్యాలయంలో ఉన్న ఫైళ్లను పరిశీలిస్తున్నారు. తిరుపతిలో ఐటీ రైడ్స్ కలకలం రేగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయినప్పటికీ ముందుగానే రైడ్స్ జరగుతున్నాయి.