Jio కొత్త పోస్ట్ పోయిడ్ ప్లాన్.. నలుగురు యూజ్ చేయొచ్చు? వివరాలు ఇవిగో
Jio new postpaid family plans:భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది జియో (Jio). పోస్ట్ పెయిడ్ (post paid) ప్లస్ స్కీమ్ కింద ప్లాన్ తీసుకొచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి జియో స్టోర్స్ వద్దకెళ్లి ఈ ప్లాన్ తీసుకొవచ్చు.
Jio new postpaid family plans:భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది జియో (Jio). రిలయన్స్ 4జీ నెట్ వర్క్ (4g network) రాకముందే దేశంలో ఇంటర్నెట్ (internet) వినియోగం చాలా తక్కువ. జియో (jio) వచ్చిన తర్వాత దాదాపు అంతా నెట్ ఉపయోగించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొత్త 5జీ (5g) కూడా తీసుకొచ్చింది. అందుకోసమే పోస్ట్ పెయిడ్ (postpaid) యూజర్ల కోసం ఆఫర్లను ప్రవేశపెట్టింది. పోస్ట్ పెయిడ్ (post paid) ప్లస్ స్కీమ్ కింద ప్లాన్ తీసుకొచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి జియో స్టోర్స్ వద్దకెళ్లి ఈ ప్లాన్ తీసుకొవచ్చు. లేదంటే హోం డెలివరీ ఆప్షన్ కూడా ఉంది.
ఇప్పటికే రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఉంది. ఇందులో 75 జీబీ (75 gb data) డేటా ఫ్రీగా ఇస్తారు. కాల్స్, మెసేజ్ ఉచితం. ఈ ప్లాన్ కోసం రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రూ.699 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో 100 జీబీ డేటా వస్తోంది. దీనికి నెట్ ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఫ్రీగా ఇస్తుంటారు. సేమ్.. కాల్స్, మెసేజ్ ఉంటాయి. ఈ రెండు ప్లాన్లలో ముగ్గురు సభ్యులను అదనంగా చేర్చుకునే వెసులుబాటు కల్పించారు. మొత్తం నలుగురు సభ్యులు వాడుకోవచ్చు. ప్రతీ సిమ్‌కు రూ.99 చార్జ్ చేస్తుంటారు. ఈ ప్లాన్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ రూ.875 కట్టాల్సి ఉంటుంది.
రూ.299 ఇండివిడ్యువల్ పోస్ట్ పెయిడ్ (post paid) ప్లాన్ ఉంటుంది. ఇందులో 30 జీబీ (30 gb) డేటా ఉంటుంది. మెసేజ్ ఫ్రీ ఉంటుంది. రూ.375 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. రూ.599 ప్లాన్‌లో కాల్స్, మెసేజ్ ఫ్రీగా ఉంటుంది. డేటా ఆన్ లిమిటెడ్ ఇస్తుంటారు. ఇందుకోసం రూ.750 సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. ఈ ప్లాన్‌లో నెల ఉచిత ట్రయల్ ఆఫర్ ఉంటుంది. ప్లాన్ తీసుకొని.. నచ్చకుంటే క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఒకవేళ ప్రీ పెయిడ్ కనెక్షన్ తీసుకోవాలని అనుకుంటే 70000 70000 నంబర్‌కు మిస్డ్ కాల్ చేస్తే వాట్సాప్‌కు రిప్లై వస్తోంది. జియో ప్రీపెయిడ్‌లో ఉన్నవారు సిమ్ మార్చాల్సిన అవసరం ఉండదు. మరో 331 నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని రిలయన్స్ జియో ఇన్పోకామ్ చైర్మన్ ఆకాశ్ ఎం అంబానీ తెలిపారు.