శామ్సంగ్, మోటోరోలా ఇప్పటికే ఫ్లిప్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. తాజాగా ఒప్పో సంస్థ ఫ్లిప్ ఫోన్‌ను లాంచ్ చేసింది. మరి ఈ ఫ్లిప్ ఫోన్ ఎప్పటి నుంచి మార్కెట్లోకి లభ్యమవుతుంది. దీని ఫీచర్లు ఏంటి? తెలుసుకుందాం.
Oppo: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో(Oppo) ఫ్లిప్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. చైనాలో ఆగస్ట్‌లో విడుదల కాగా.. తాజాగా ఇండియాలో మొబైల్ అందుబాటులోకి వచ్చింది. ఒప్పో ఫైండ్ ఎన్2కి(Oppo Find N2) కంటిన్యూగా.. ఎన్3 ( N3) ఫ్లిప్‌ను తీసుకొచ్చింది. మరి ఒప్పో ఫైండ్ ఎన్3 (Oppo Find N3) ఫీచర్లేంటి? ఎప్పటి నుంచి ఇది మార్కెట్లో లభ్యమవుతుంది? అనే విషయాలు తెలుసుకుందాం.
ఒప్పో ఫైండ్ ఎన్3 (Oppo Find N3) ఫ్లిప్ 12జీబీ+256జీబీ వేరియంట్లో లభిస్తుంది. అక్టోబర్ 22 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్లైన్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభం అవుతాయి. కంపెనీ దీని ధరను రూ.94,999గా నిర్ణయించారు. ఈ ఫోన్లపై కంపెనీ రూ.8వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.12వేల వరకు వివిధ కార్డులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇవ్వనున్నారు. ఇందులో రెండు స్క్రీన్లు ఉంటాయి. మెయిన్ డిస్ప్లే 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేటుతో వస్తున్న ఈ ఫోన్లో 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. ఔటర్ డిస్ప్లే 3.26 అంగుళాల ఎస్డీ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది. దీనికి 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వస్తుంది. గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ వస్తుంది.
ఈ ఫోన్లో మీడియాటెక్ డిమెన్సిటీ 9200 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయడ్ 13 ఆధారిత కలర్ ఓఎస్ 13.2తో పనిచేస్తుంది. ఇందులో 50ఎంపీ(Mp) ఓఐఎస్‌తో ఉన్న కెమెరాతో పాటు 48ఎంపీ(Mp) కెమెరా, 32ఎంపీ(Mp) టెలిఫొటో లెన్స్ ఇచ్చారు. వన్‌ప్లస్ ఫోన్లలో ఉండే అలర్ట్ స్లయిడర్‌ను ఇందులో అమర్చారు. 4300 ఎంఏహెచ్(Mah) బ్యాటరీ 44w వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 198గ్రాములు బరువు ఉండే ఈ ఫోన్లో ఎన్ఎఫ్సీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, బ్లూటూత్ 5.3 ఉంటుంది.