Kia Leasing Program : కొందరికి కొత్త కార్లను కొనుక్కునేంత డబ్బు ఉండదు. మరి కొందరికి ఏటా కారు మార్చేసే అలవాటు ఉంటుంది. వీరు ఏటా కొత్త కారు కొని అమ్మేస్తుంటే చాలా డబ్బు వృధా అవుతుంది. ఈ రెండు సమస్యలకు పరిష్కారంగా ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఓ కొత్త పథకంతో ముందుకు వచ్చింది. అదే కియా కార్ లీజింగ్ ప్రోగ్రాం9KIA LEASING PROGRAM). ఈ ప్రోగ్రాం కింద ఏడాది లేదా రెండేళ్ల పాటు కారును లీజుకు తీసుకోవచ్చు. హైదరాబాద్, దిల్లీ, చెన్నై, పూనే, ముంబయి, బెంగళూరు తదితర ఆరు సిటీల్లో ఈ సేవలు ప్రారంభం అయ్యాయి.
నిజానికి విదేశాల్లో ఈ కార్(CAR) సబ్స్క్రిప్షన్ అనేది చాలా ప్రాచుర్యం పొందుతోంది. మన దగ్గర ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతోంది. కియా దీన్ని ఇప్పుడు ఇలా ఆరు ప్రధాన నగరాల్లో ప్రారంభించిందని కియా ఇండియా చీఫ్సేల్స్ఆఫీసర్ మ్యుంగ్ సిక్ సోన్ తెలిపారు. ఈ మేరకు తాము ఓరిక్స్ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.
ఈ లీజింగ్ కోసం ఎలాంటి అడ్వాన్స్ కట్టనక్కర్లేదు. కియా సోనెట్ కారును లీజ్‌కి( LEASE) తీసుకోవడానికి నెలకి రూ.21,900 కడితే సరిపోతుంది. అదే సెల్టోజ్ కారును తీసుకోవాలంటే నెలకు రూ.28,900 కట్టాల్సి ఉంటుంది. కారెన్స్‌కు రూ.28,800 చెల్లించాలి. వేరేగా ఇన్స్యూరెన్స్లు, ట్యాక్సుల్లాంటివి ఏవీ పే చేయాల్సిన అవసరం ఉండదు. నెలవారీ అద్దెలోనే ఇవన్నీ కవర్ అయి ఉంటాయి. కనుక ఎక్సట్రాగా ఏమీ పే చేయాల్సిన పని ఉండదు.