Sanjeev Kapoor: వంటలు చేస్తూ రూ.750 కోట్లకు అధిపతి!
సంజీవ్ కపూర్ తనకు ఇష్టమైన వంటలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. ప్రపంచంలోనే నెంబర్ వన్ చెఫ్‌గా రికార్డుకెక్కాడు. ప్రస్తుతం ఆయన ఆదాయం రూ.750 కోట్లు. భారతదేశంలో ఆయన టాప్ చెఫ్‌గా కొనసాగుతున్నాడు.
చాలా మంది డాక్టర్లు, ఇంజినీర్లు అవ్వాలనుకుంటారు. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తనకు ఇష్టమైన వంటలను చేస్తూ చెఫ్ వృత్తిని ఎంచుకున్నాడు. ఆయనెవరో కాదు ప్రముఖ సెలబ్రిటీ చెఫ్, వ్యాపారవేత్త సంజీవ్ కపూర్ (Sanjeev Kapoor). ఫుడ్ ఫుడ్ అనే 24 గంటల ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని చెఫ్‌గా గుర్తింపు పొందాడు. అంచెలంచెలుగా ఎదిగి పద్మశ్రీ అవార్డు(padmasri Award)ను గెలుచుకున్నాడు.
50 రెస్టారెంట్లను సొంతం చేసుకుని సంజీవ్ కపూర్(Sanjeev Kapoor) తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పొందాడు. సంజీవ్ కపూర్ 1964లో అంబాలా ప్రాంతంలో పుట్టాడు. ఆయన తండ్రి ఎస్బీఐలో ఉద్యోగం చేసేవాడు. అయితే ఉద్యోగరీత్యా ఢిల్లీ, మీరట్, సహారన్ పూర్ లతో సహా చాలా ప్రాంతాలకు బదిలీ అయ్యాడు. తండ్రి ట్రాన్స్ఫర్తో పాటు సంజీవ్ కపూర్ కూడా తన స్కూల్స్ మారాల్సి వచ్చింది. సంజీవ్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ పూర్తి చేసి ఆ తర్వాత ఆర్కిటెక్చర్ లో వృత్తిని చేపట్టాలని అనుకున్నాడు.
జీ టీవీ నుంచి కుకింగ్ షో హోస్ట్(Cooking Host)గా చేసిన ఆయన ఆ ప్రోగ్రామ్ తర్వాత తన జీవితం పూర్తిగా మారింది. 120 దేశాలలో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆసియాలోనే అత్యధిక కాలం ప్రసారమై రికార్డుకెక్కింది. ప్రపంచానికి తన రుచులను పరిచయం చేస్తూ సంజీవ్ కపూర్(Sanjeev Kapoor) చివరికి భారతదేశపు టాప్ చెఫ్‌గా నిలిచాడు. 1998లో ఆయన తన తొలి రెస్టారెంట్‌ను దుబాయ్‌లో ప్రారంభించాడు. విదేశాలలోని చాలా ప్రాంతాల్లో ఆయన తన రెస్టారెంట్లను స్థాపించాడు. 2019 లో కపూర్ రూ.24.8 కోట్ల ఆదాయంతో భారతదేశంలో అత్యంత ధనిక చెఫ్‌గా నిలిచాడు. ఇప్పుడాయన రూ.750 కోట్లకు అధిపతి అయ్యి ఎందరికో స్ఫూర్తిదాయకమయ్యారు.