Tomato Price: టమాట ధరలు తగ్గుదల..ఊపిరిపీల్చుకున్న ప్రజలు!
టమాట రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి భారీ ధరలు పలుకుతున్న టమాట ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం మదనపల్లి టమాట మార్కెట్లో కిలో రూ.44 నుంచి రూ.60లోపు పలుకుతోంది.
మదనపల్లి మార్కెట్లో(Madanapalli Market) టమాట ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటి వరకూ పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. రికార్డు రేట్లను చూసి టమాట ధరలు(Tomato Prices) గత కొన్ని రోజుల నుంచి దిగి వస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాట ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత నాలుగు రోజులుగా ఇక్కడి మార్కెట్లో భారీగా టమాట పంట వచ్చి చేరుతోంది. దీంతో రేట్లు దిగి వస్తున్నాయి.
నిన్నటి వరకూ టమాటా(Tomato) కిలో రూ.80 నుంచి రూ.100ల వరకూ పలికేది. గతంలో అయితే రూ.250 వరకూ ఆ ధరలు ఉండేవి. అయితే ప్రస్తుతం గ్రేడ్ ఏ (Grade A) టమాటాలు కిలో రూ.50 నుంచి రూ.64 వరకు పలుకుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే గ్రేడ్ బి (Grade B)రకం అయితే రూ.36 నుంచి రూ.48ల వరకూ పలుకుతున్నాయి.
ఈ లెక్కన సగటున రైతులు కిలోకు రూ.44 నుంచి రూ.60లకు విక్రయిస్తున్నారు. కిలో రూ.60ల లోపు టమాటాలను రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసినట్లుగా మదనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ (Madanapalli Market) కార్యదర్శి అభిలాష్ వెల్లడించారు. గతకొన్ని రోజుల నుంచి ఊపందుకున్న టమాట రేట్లు (Tomato prices) ఇప్పుడు తగ్గముఖం పట్టాయి.
ఇప్పటి వరకూ మదనపల్లి మార్కెట్ చరిత్రలోనే మొదటిసారిగా జూలై 30వ తేదిన కిలో టమాటా(tomato) ధర అత్యధికంగా రూ.196 పలకడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో(telugu states) ఈ రేట్లు రూ.250ల వరకూ పలికాయి. ఇప్పుడు ఆ రేట్లు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.