TG: వైద్య విద్యలో నాణ్యతకు పెద్దపీట వేశామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఇప్పటికే వైద్యరంగంలో 8 వేల పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. త్వరలో మరో 6 వేల పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. కొడంగల్, సంగారెడ్డి వైద్య కళాశాలకు అనుమతి వచ్చినట్లు పేర్కొన్నారు.