రోజురోజుకు వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ కిలో వెండి రూ.3000 పెరిగి రూ.1,80,000కు చేరుకుంది. కాగా, నిన్నటి కంటే బంగారం ధర భారీగా తగ్గింది. HYD మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,860 తగ్గి రూ.1,22,290కి చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,700 తగ్గి రూ.1,12,100గా ఉంది.