KNR: హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు జీతాల ఆలస్యంపై నిరసనగా మౌన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ప్లకార్డులతో నిశ్శబ్దంగా నిరసన తెలిపిన ఉద్యోగులు, జీతాల చెల్లింపులో జాప్యం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.