ATP: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈనెల 25లోగా పంట నమోదు చేసుకోవాలని కుందుర్పి మండల వ్యవసాయ అధికారి విజయకుమార్ శుక్రవారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పంట సాగు చేసిన రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ప్రతి రైతు గడువులోగా పంట నమోదు చేయించుకోవాలన్నారు.