SKLM: పాతపట్నం(M)తామరలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఎంజిఆర్ శుక్రవారం ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఓ ప్రైవేటు ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరం నిర్వహించామన్నారు. క్యాన్సర్ వ్యాప్తిని నిరోధించేందుకు ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.