KMM: కమిషన్ల కోసమే జిల్లా మంత్రులు పనిచేస్తున్నారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల BC రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు విధించిన స్టే ప్రజాస్వామ్య చరిత్రలో కాంగ్రెస్ పాలనకు నల్లపేజీగా నిలిచిందని శుక్రవారం నిర్వహించిన సమావేశంలో చెప్పారు. న్యాయస్థానం చేతిలో చెంపదెబ్బ తిన్నారన్నారు.