KNR: గంగాధరలో పందుల సంఖ్య రోజురోజుకూ పెరిగి పంటలను నాశనం చేస్తున్నాయి. వరి పంటలు మొలక దశలోనే పందులు ధ్వంసం చేయడంతో రైతుల కష్టం వృథా అవుతోంది. రాత్రి పగలు కాపలా కాసినా పందుల బీభత్సం ఆగడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు లేకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. పందుల నియంత్రణకు ఉచ్చులు, కాంతి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.