NGKL: జిల్లా కేంద్రంలోని 11వ వార్డులో హృదయవిదాకర ఘటన వెలుగుచూసింది. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు, కొడుకు పెళ్లి చేసిన ఇందిరమ్మను (భర్త మరణానంతరం) కొడుకు ఇంటి నుంచి గెంటివేశాడు. ఆస్తిలో భాగం ఇవ్వకుండా, అన్నం పెట్టకుండా రోడ్డు పాలుచేశాడు. దిక్కుతోచని తల్లి రూ.5 భోజనంపై ఆధారపడుతూ.. ఇంటి మెట్లపైనే పడుకుంటోంది. ఈ ఘటనపై అధికారులు స్పందించి కోడుకుకి బద్ది చెప్పాలని స్ధానికులు కోరారు.