CTR: కుప్పం మున్సిపాలిటీలో ప్లాస్టిక్ కవర్లను వాడకూడదు అంటూ మున్సిపల్ అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నా దుకాణదారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న దుకాణదారులకు మున్సిపల్ అధికారులు ఫైన్ వేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ప్లాస్టిక్ కవర్లు కలిగిన పలు దుకాణాలకు రూ. 1000 చొప్పున ఫైన్ విధించినట్లు కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు.