రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ 2025కి సంబంధించిన ఫోర్బ్స్ ఇండియాస్ 100 రిచెస్ట్ లిస్టులో మళ్లీ టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. గతంలో సన్ ఫార్మా దిలిప్ సంఘ్వీ, అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ టాప్ ప్లేసులో కొంత కాలం కొనసాగారు. ప్రస్తుతం అంబానీ సంపద 105 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదానీ కుటుంబం 92 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు.