కేంద్ర ప్రభుత్వం EPFO ఖాతాదారులకు మరో గుడ్న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్ఓ ఆటో క్లెయిమ్ సదుపాయం పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచింది. ఇందులో ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి పనులకు అడ్వాన్స్ తీసుకునే వారికి కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. దీంతో 27.74 కోట్ల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.15 కోట్ల క్లెయిమ్లు ఆటోమేటిక్ సెటిల్మెంట్ పద్ధతి ద్వారా పరిష్కరించబడ్డాయి.