TG: రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు జీతాలు రాక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వారికి రావాల్సిన జీతాల కోసం రోజుల తరబడి వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ నెల జీతం ఇప్పటివరకు రాలేదని ఆవేదన చెందుతున్నారు. ఏ నెల ఎప్పుడు జీతం వస్తుందో తెలియట్లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఉద్యోగులు ఇవాళ మధ్యాహ్నం లంచ్ టైంలో ‘మౌన ప్రదర్శన’కు పిలుపునిచ్చారు.