రేపు దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను UPSC నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ ఈ-అడ్మిట్ కార్డులో పేర్కొన్న సూచనలను పాటించాలని అధికారులు సూచించారు. అడ్మిట్ కార్డ్‌లోని పేరు, ఫొటో వంటి వివరాలను సరిచూసుకోవడం మంచిది. గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ప్రతి సెషన్ ప్రారంభానికి 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు.