భారత తయారీ రంగ వృద్ధి ఏప్రిల్లో స్వల్పంగా పెరిగింది. కొత్త ఆర్డర్ల రాక ఇందుకు ప్రధాన కారణమని HSBC ఇండియా వెల్లడించింది. పర్ఛేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(PMI) సూచీ మార్చిలో 53.9 పాయింట్ల వద్ద ఉండగా, ఏప్రిల్లో 54.7 పాయింట్లకు చేరుకుంది. గిరాకీలో స్థిరత్వం, ప్రకటనల వల్ల ఉత్పత్తి పెరిగినప్పటికీ.. గత నాలుగేళ్లలో ఇది రెండో కనిష్ఠ పెరుగుదలగా నమోదైంది.