TG: భారీ వర్షాల కారణంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ప్రకటన విడుదల చేశారు. ఇవాళ, రేపు జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే KU అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామని స్పష్టం చేశారు.