కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 4 స్లాబులను రెండు స్లాబులకు తగ్గించే అవకాశం ఉంది. చిరువ్యాపారుల పర్మిషన్లను సులభతరం చేయనుంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే.. కేంద్రం జీఎస్టీ కొత్త రేట్లను తక్షణమే అమలు చేయబోతుందనే వార్తల నేపథ్యంలో వేతన జీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.