TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే 54వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. త్వరలో మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎస్సీ వర్గీకరణ పూర్తైన వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 16 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని యోచిస్తోంది. వీటిలో ఎక్కువగా టీచర్, గ్రూప్-3 ఉద్యోగాలే ఉన్నట్లు సమాచారం.