మామిడి ధరలు రైతులకు షాక్ ఇస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టన్ను తోతాపురి ధర రూ. 1.10 లక్షల వరకు ఉండగా, ప్రస్తుతం రూ.4-7 వేలకు పడిపోయింది. అదేవిధంగా బంగినపల్లి మామిడి ధర రూ.1.75 లక్షల నుంచి రూ.50-60 వేలకు కుప్పకూలింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ధరలు అమాంతం పడిపోయాయి.