గతవారం నష్టాల బాట పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో కళకళలాడాయి. సెన్సెక్స్ 554.84 పాయింట్లు లాభపడి 80,364.49 వద్ద ముగిసింది. నిఫ్టీ 198.20 పాయింట్లు పెరిగి 24,625.05 వద్ద స్థిరపడింది. ఆటోమొబైల్, ఐటీ, లోహ రంగ సూచీలు రాణించాయి. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు క్షీణించి 88.20 వద్ద ఆల్‌టైం కనిష్ఠ స్థాయిలో ముగిసింది.