AP: విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల నియామక ప్రకటన విడుదలకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈనెల 15న 1,500 పోస్టులకు ప్రకటన విడుదల కానుంది. విశ్వవిద్యాలయాలకు మంజూరు చేసిన పోస్టుల్లో బ్యాక్‌లాగ్‌లు మినహాయించి మిగతా వాటిల్లో 43 శాతం ఖాళీలు భర్తీ చేయనున్నారు. వీటికి రిజర్వేషన్ రోస్టర్‌ను ఖరారు చేసే ప్రక్రియను విశ్వవిద్యాలయాలు చేపట్టాయి.