దేశంలో గడచిన పదేళ్లలో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య భారీగా పెరిగింది. 2014-24 వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారుల పెరుగుదలపై SBI రీసెర్చ్ నివేదిక విడుదల చేసింది. అలాగే 2014లో మధ్యతరగతి ఆదాయం రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండగా 2024లో రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెరిగిందని పేర్కొంది. 2014లో పన్ను చెల్లించే వారి సంఖ్య 3.79 కోట్ల మంది ఉండగా 2014లో 8.62 కోట్లకు పెరిగింది.