NLR: చేజర్ల మండలం ఆదురుపల్లి ఆదురమ్మ గుడి సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం తప్పింది. నెల్లూరు నుంచి కలువాయి వెళ్తున్న కారు రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళలకు ఎలాంటి గాయాలు కాలేదు. స్థానికులు వెంటనే స్పందించి కారును బయటకు తీశారు.