WNP: గోపాలపేట మండలానికి చెందిన దొడ్డి నాగన్న అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గ్రామానికి చేరుకుని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన ఈశ్వర్ మృతి చెందిన విషయం తెలుసుకుని ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తన సానుభూతిని తెలిపారు.