VZM: మెరకముడిదాం మండలం బుధరాయవలసకు చెందిన కాంక్రీట్ లేబర్‌గా పనిచేస్తున్న ఎలకల జోగి నాయుడు (40) గురువారం మధురవాడ మొగదారమ్మ కాలనీ సమీపంలోని ఉన్న కాలువలో పడి మృత చెందాడు. పండగ పూట మద్యం మత్తులో కాలువలో పడి మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.