»Yoga Asanas To Reduce Signs Of Aging And Look Younger
Yoga Asanas: ఈ యోగాసనాలతో యవ్వనంగా మెరిసిపోవచ్చు..!
భారతదేశంలో ప్రారంభమైన యోగా అభ్యాసం ద్వారా శరీరంలోని అనేక రుగ్మతలను నివారించుకోవచ్చు. ప్రస్తుతం ఇది యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో భాగంగా కూడా ఉంది. యోగా మిమ్మల్ని శారీరకంగా ఫిట్‌గా ఉంచడంతోపాటు ఆరోగ్యంగా కూడా మార్చుతుంది. అయితే కొన్ని ఆసనాలు వేయడం ద్వారా యంగ్ గా కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
క్రమం తప్పకుండా యోగా(Yoga) సాధన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడమే కాకుండా, వృద్ధాప్య సంకేతాలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి దీనికి ఏ యోగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. కొన్ని ప్రత్యేక యోగా ఆసనాలు వృద్ధాప్యంలో కూడా చర్మ దృఢత్వాన్ని కాపాడతాయి. మొటిమలను నివారిస్తాయి. మీరు 40ల్లోనూ 30గా కనిపిస్తారు. మరి ఆ ఆసనాలేంటో ఓసారి చూద్దాం..
భుజంగా ఆసనం
రుగ్మతల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి మెదడుకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. ఇది మీ ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
సర్వంగాసనం
సర్వాంగాసనం చర్మానికి ఉత్తమమైన ఆసనమని చెబుతారు. ఇలా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి చర్మం మెరుస్తూ మెరుస్తుంది. దీనితో పాటు, ముఖంపై మొటిమలను కూడా తొలగిస్తుంది.
హలాసనా
హలాసానా శరీరంలో రక్త ప్రసరణను పెంచడానికి ఈ ఆసనం ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇది ముఖాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా, ఈ ఆసనాన్ని అభ్యసించడం వల్ల కడుపుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆసనం చేయడం వల్ల పొట్టలో కొవ్వు వంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు.
అదోముఖ శ్వనాసన
అదోముఖ శ్వనాసనం ముఖం, తలపై రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, ఇది మొటిమలు, మచ్చలు , ముడతలు వంటి చర్మ సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది. ముఖంలో మెరుపు రావాలంటే ఈ యోగాసనం చేయాలి.