Xiaomi 14 నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఈ సంవత్సరం చివరిలో అనగా డిసెంబర్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అధికారిక ప్రకటన కంటే ముందు, ఫోన్ మోడల్ ఇలా ఉండబోతోందని లీకులు బయటకు వచ్చాయి. రెండు వేర్వేరు వెర్షన్లలో వచ్చే హై ఎండ్ Xiaomi 14 ప్రో మోడల్‌ను సూచిస్తున్నాయి. చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi 14 సిరీస్‌ను ఈ సంవత్సరం నవంబర్, డిసెంబర్ మధ్య ఎప్పుడైనా లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. బేస్ Xiaomi 14, Xiaomi 14 ప్రొ మోడల్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. వాటి స్పెసిఫికేషన్లకు సంబంధించి పుకార్లు ఉన్నప్పటికీ, తాజా సమాచారం తెలిసిన టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ నుంచి వివరాలు తెలిశాయి. ఇది ఈ హై ఎండ్ ప్రో మోడల్ డిజైన్‌కు సంబంధించిన వివరాలను పంచుకుంది. కంపెనీ రాబోయే ప్రీమియం ఫోన్ 2.5D పెద్ద ఫ్లాట్ డిస్ప్లేను కలిగి ఉంటుందని వెల్లడించింది.
14 ప్రో ఫ్లాట్ డిస్ప్లేలో రిలీజ్ కానుంది. 3D కర్వ్డ్ ప్యానెల్, నాలుగు వైపులా స్లిమ్ బెజెల్‌లను కలిగి ఉన్న ఒక వేరియంట్ కూడా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపింది. ఇప్పటివరకు మనకు తెలిసిన దాని ఆధారంగా, స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 8 Gen 3 SoC అమర్చబడి ఉండవచ్చు. మునుపటి లీక్ కూడా 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే పెద్ద 5,000mAh బ్యాటరీ ప్యాక్‌ని సూచించింది. పరికరం 90W, 120W వెర్షన్‌ను కలిగి ఉన్న రెండు వేర్వేరు వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ రేట్లను అందిస్తుందని పేర్కొంది. ఫ్లాట్ కర్వ్డ్ మోడల్‌లు విభిన్న ఛార్జింగ్ స్పీడ్లను కలిగి ఉండవచ్చని తెలిపింది.