»We Are Boycotting Modis Visit Brs Working President Ktr
KTR: మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నాం
తెలంగాణను అవమానించిన మోడీ ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని రేపటి వరంగల్ పర్యటనను బీఆర్ఎస్ నాయకులంతా బహిష్కరిస్తున్నట్లు మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ తెలిపారు. తల్లిని చంపి బిడ్డను వేరుచేశారని మాట్లాడి, తెలంగాణ రాష్ట్ర పుట్టుకనే అవమానించిన దుర్మార్గమైన వ్యక్తి ప్రధాని మోడీ (PM Modi) అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. పుణ్యకాలం అంత అయిపోయినంకా 9 ఏళ్ల తరువాత ఏదో తూతూ మంత్రంగా వచ్చి బిచ్చం వేసి పోతాం అంటే ఊరుకునేది లేదని, ఏ మొహం పెట్టుకొని ప్రధాని తెలంగాణకు వస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గుజరాత్‌కు రూ.20 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు. తెలంగాణకు కేవలం రూ.521 కోట్ల నిధులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఏమీ అమాయకులు కారని, అన్ని గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. రేపటి మోడీ పర్యటనను తామంతా బహిష్కరిస్తున్నామని చెప్పారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ ఏమైందని నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులంతా ఒకే మాటమీద ఉంటామని రేపటి మోడీ పర్యటనకు ఎవరు హాజరు కాబోమని తెలిపారు.
మోడీ ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నావు. మోడీ తెలంగాణ పర్యటనను మేము బహిష్కరిస్తున్నాం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/F5lXpfebAQ