»Visakhapatnam Police And Revenue Officials Acquisitioned Gitam University Govt Lands
విశాఖపట్టణంలో ఉద్రిక్తత.. GITAM University వద్ద భూములు స్వాధీనం
పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలనే పట్టుదలతో ఉన్న సీఎం జగన్ (YS Jagan) ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలుపెట్టారు.
ఏపీలోని ప్రఖ్యాత గీతం విశ్వవిద్యాలయం (GITAM University) వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. విశాఖపట్టణంలోని (Visakhapatnam) వర్సిటీ ఆవరణలో ప్రభుత్వ స్థలం ఉందని.. ఆ స్థలాన్ని పరిరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ భారీగా పోలీస్ (Police) బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియలేదు. అయితే గురువారం తెల్లవారుజామున 2 గంటలకు వర్సిటీకి వెళ్లే రోడ్లపై పోలీసులు ఆంక్షలు (Restrictions) విధించడంతో స్థానికులు భయాందోళన చెందారు.
గీతం విశ్వవిద్యాలయంపై భూకబ్జా (Land Occupation) ఆరోపణలు ఉన్నాయి. వర్సిటీ సమీపంలోని ప్రభుత్వ భూములను (Govt Lands) అన్యాక్రాంతం చేస్తోందనే వార్తలు వచ్చాయి. దీంతో రెవెన్యూ అధికారులు (Revenue Officias) రంగంలోకి దిగారు. రెండేళ్ల కింద 36 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో గీతం కళాశాలను ఆనుకుని ఉన్న 14 ఎకరాల భూమిని ప్రభుత్వ అధికారులు తమ పరిధిలో తీసుకున్నారు. తాజాగా మరో నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని చెప్పి అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు చీకట్లో రంగంలోకి దిగారు. సర్వే నంబర్ 15, 16, 19, 20 పరిధిలోని 4.36 ఎకరాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ (Fencing) వేయించారు.
భూమిని స్వాధీనం చేసుకోవడానికి చీకట్లో పని చేయడం కలకలం రేపింది. ఎండాడ (Endada), రుషికొండ (Rishikonda) మార్గాల్లో బారికేడ్లు వేసి ఎవరినీ అటువైపు వెళ్లనివ్వలేదు. స్థానిక మీడియాను కూడా అనుమతించలేదు. ఐడీ కార్డులు చూపించిన స్థానికులను మాత్రమే ఆ రోడ్లపైకి అనుమతించారు. పోలీస్ బందోబస్తు మధ్య కంచె నిర్మించారు. కాగా పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలనే పట్టుదలతో ఉన్న సీఎం జగన్ (YS Jagan) ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలుపెట్టారు. అందులో భాగంగానే గీతం వర్సిటీ వద్ద భూములను స్వాధీనం చేసుకోవడం. కాగా వర్సిటీపై వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.