Actor: విహార యాత్రలో విషాదం..హీరో భార్య గుండెపోటుతో మృతి
మిగతా జీవులతో పోల్చితే.. మానవులు తాము అనుకున్నట్టుగా జీవితాన్ని అనుభవిస్తున్నారు. కానీ కరోనా తర్వాత పిట్టల్లా రాలిపోతున్నారు జనాలు. ఎప్పుడు, ఎవరి ఒడికి మృత్యువు చేరుతుందో చెప్పలేని పరిస్థితి. గుండెపోటుతో ఉన్నట్టుండి కళ్ల ముందే కుప్పకూలిపోతున్నారు. తాజాగా ఓ స్టార్ హీరో భార్య తన కళ్లముందే కుప్పకూలిపోయిన విషాద సంఘటన చోటుచేసుకుంది.
భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి మట్టిలో కలిసిపోవాల్సిందే. పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు. కానీ సంపూర్ణంగా నిండు నూరేళ్లు జీవించలేకపోతున్నాడు మానవుడు. ముఖ్యంగా కరోనా తర్వాత జీవితాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. అందుకే.. కరోనా తర్వాత ఎంత బిజీగా ఉన్నా కూడా.. ఫ్యామిలీతో కలిసి తగిన సమయాన్ని గడుపుతున్నారు. క్షణం తీరిక లేకుండా ఉన్న స్టార్ హీరోలు సరదాగా విదేశాలకు హాలిడే ట్రిప్ వేస్తున్నారు. కన్నడ హీరో, దర్శకుడు విజయ్ రాఘవేంద్ర(Vijay Raghavendra) కూడా భార్యతో కలిసి బ్యాంకా హాలీడే ట్రిప్‌కు వెళ్లాడు. కానీ ఈ విహార యాత్రలో అనుకొని విషాదం చోటు చేసుకుంది.
సోమవారం ఉదయం విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన(Spandana)కు గుండెపోటు(heart attack)తో రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లుగా నిర్థారించారు వైద్యులు. ఆమెకు ముందుగా బీపీ తగ్గి గుండెపోటుకు దారి తీసిందని తెలుస్తోంది. దీంతో ఈ వార్త మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమనో శోక సంద్రంలో పడేసింది. ఆమె భౌతికకాయం రేపు ఆగస్టు 8న బెంగళూరుకు చేరుకుంటుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక విజయ రాఘవేంద్ర, స్పందన ప్రేమ వివాహం (love marriage) చేసుకున్నారు. 2007 ఆగస్టు 26న వీళ్ల పెళ్లి జరిగింది. ఈ జంటకు శౌర్య అనే కొడుకు ఉన్నాడు. అయితే మరికొద్ది రోజుల్లో 16వ వివాహ వార్షికోత్సవానికి రెడీ అవుతున్నారు విజయ్, స్పందన. ఇలాంటి సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇకపోతే.. విజయ్ రాఘవేంద్ర కన్నడ సినిమాల్లో నటుడిగా దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రిటైర్డ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ బీకే శివరామ్ కుమార్తె అయినటువంటి స్పందన.. 2016లో అపూర్వ అనే సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది.