»Vegan Raw Food Influencer Zhanna Dart Dies Reportedly Of Starvation
Youtubers జర జాగ్రత్త.. ప్రముఖ విగన్ మృతి
ఆహారపు అలవాట్లను మారిస్తే ఇబ్బందులే. శరీరం తట్టుకోదు.. అలా ఓ ఇన్ ప్లూయెన్సర్ ఆకలితో అలమటించి చనిపోయింది. పచ్చి కూరగాయాలు, జ్యూస్ తీసుకోవడంతో శరీరం తట్టుకోలేకపోయింది.
Vegan Raw Food Influencer Zhanna D'Art Dies Reportedly Of Starvation
Vegan Raw Food Influencer Zhanna: అందం కోసం, ఆరోగ్యం కోసం అంటూ కొందరు పళ్లు, ఫలాలు తింటారు. మరికొందరు పచ్చి కూరగాయాలు, వివిధ రకాల జ్యూస్ తీసుకుంటారు. అలాంటి కోవకు చెందిన వారే జన్నా సమ్సోనొవా (Zhanna Samsonova). ఆమె గత దశాబ్ద కాలం నుంచి జ్యూస్, పచ్చి కూరగాయాలు తింటుంది. దానికి సంబంధించిన వీడియోలను ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేస్తోంది. అలా తీసుకుంటున్న ఆమె.. ఆకలితో అలమటించింది. గత నెల 21వ తేదీన చనిపోయింది. గత కొన్నేళ్లుగా పచ్చి కూరగాయాలను తినడం వల్ల శరీరం తట్టుకోలేక పోయింది. ఆగ్నేయాషియా పర్యటనలో ఉన్న ఆమె అస్వస్థతకు గురై.. చనిపోయారు.
ఇటీవల శ్రీలంక పర్యటనకు జన్నా (Zhanna) వచ్చారు. అక్కడ ఆమె కాలు వాచిపోయి కనిపించాయని స్నేహితురాలు ఒకరు మీడియాకు తెలిపారు. చికిత్స తీసుకోవాలని ఇంటికి పంపించామని.. కానీ ఆమె వెళ్లిపోయిందని తెలిపారు. జన్నాను చూసి తనకే భయం వేసిందని తెలిపారు. జన్నా పై పోర్షన్లో ఉంటానని.. ప్రతీ రోజు ఆమెను చూస్తే తనకే భయం వేసిందని గుర్తుచేశారు. ఆరోగ్యం దెబ్బతినడంతో ట్రీట్మెంట్ తీసుకోవాలని రోజు చెప్పేదానిని.. కానీ ఏనాడు లెక్కచేయలేదని వివరించారు.
జన్నా (Zhanna) కలరా లాంటి ఇన్ ఫెక్షన్ వల్ల చనిపోయి ఉంటుందని ఆమె తల్లి చెబుతున్నారు. జన్నా (Zhanna) మృతికి గల కారణాలు అధికారికంగా ఇంకా తెలియలేదని చెప్పారు. జన్నా పచ్చి కూరగాయాలు తినడం, అలసిపోవడం వల్ల శరీరంపై ఒత్తిడి వచ్చి ఉంటుందని తెలిపారు. గత ఏడేళ్లుగా స్వీట్ జాక్ ఫ్రూట్, దురియన్ మాత్రమే తీసుకుందని క్లోజ్ ఫ్రెండ్ ఒకరు తెలిపారు. చనిపోయే కొద్దీరోజుల ముందు జన్నా ఆధ్మాత్మికంగా మాట్లాడారు. శరీరం, మనస్సు రోజు మార్పు చెందడాన్ని గమనిస్తున్నాను. తన శరీరంలో జరుగుతున్న మార్పును ప్రేమిస్తున్నాను.. ఈ ఆహారపు అలవాట్లను కొనసాగిస్తానని తెలిపారు. అలా చేసి, చేసి.. చివరకు చనిపోయింది.