Woman Influencer Yoga On Road: సోషల్ మీడియా వచ్చిన తర్వాత హద్దు అదుపు లేకుండా పోయింది. కొత్త దనం పేరుతో వీడియోలు, షార్ట్స్ చేస్తున్నారు. అలా ఫేమ్ అవుతూ.. సంపాదిస్తున్నారు. కొందరికీ పిచ్చి పీక్‌కి చేరింది. అందుకే.. కొన్ని చర్యలకు దిగుతూ అభాసు పాలవుతున్నారు. గుజరాత్లో ఓ లేడీ (Woman Influencer) ఇలానే చేసి.. చివరికీ పోలీసుల చేత చివాట్లు తింది.
దినా పార్మర్ అనే యువతి నడిరోడ్డుపై యోగాసనాలు చేసింది. రోడ్డుపై యోగా చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వర్షం పడుతోన్న ఆమె యోగా చేసింది. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది. నెటిజన్లు కామెంట్స్ చేశారు. పోలీసులు చూసి.. అమ్మాయిని స్టేషన్ పిలిపించారు.
A video went viral on social media in Rajkot city ,Gujrat of a lady performing yoga on road .Legal action was taken against lady on the basis of viral video. Gujarat is considered as one of the safest State in India only because of @GujaratPolice 🫡 pic.twitter.com/kSwL5W7qKy
ఇదేం పని అని ఆమెను అడిగారు. రోడ్డు మీద.. వర్షం పడుతుంటే ఇలా ఎందుకు చేశావని అడిగారు. ఫైన్ కట్టించారు. జరిమానా కట్టించుకోవడమే కాదు.. మరొకరు ఇలా చేయొద్దని ఆమెతోనే చెప్పించారు. ఆ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో పోలీసుల చర్యలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆ యువతి నిజంగానే తప్పు చేసిందని అంటున్నారు. లేదంటే వాహనాలు స్పీడ్‌గా వస్తే ప్రమాదం జరిగి ఉండేదని చెబుతున్నారు.