TC Attack మమ్మల్నే డబ్బులు అడుగుతావా? రైల్లో టీసీపై యువకుల దాడి
టికెట్ (Ticket) తీసుకుని ప్రయాణించాల్సిన ప్రయాణికులు కొందరు టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. వారిని నియంత్రించేందుకు ఆయా సంస్థలు టికెట్ కలెక్టర్లు (టీసీ) లను నియమిస్తారు. వాళ్లు బస్సులు, రైళ్ల (Rail)ను తనిఖీ చేసి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారిని అడ్డగిస్తారు.
బస్సులోనైనా.. రైలులోనైనా.. పడవలోనైనా.. విమానంలోనైనా టికెట్ లేని ప్రయాణం నేరం. టికెట్ (Ticket) తీసుకుని ప్రయాణించాల్సిన ప్రయాణికులు కొందరు టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. వారిని నియంత్రించేందుకు ఆయా సంస్థలు టికెట్ కలెక్టర్లు (టీసీ) లను నియమిస్తారు. వాళ్లు బస్సులు, రైళ్ల (Rail)ను తనిఖీ చేసి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారిని అడ్డగిస్తారు. ఈ సందర్భంగా టికెట్ కన్నా అధికమొత్తంగా జరిమానాగా వేస్తారు. కాగా ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో ఇదే విషయమై వాగ్వాదం జరగ్గా.. ఇద్దరు యువకులు టీసీ (Ticket Collector- TC)పై దారుణంగా దాడికి పాల్పడ్డారు. రైల్వే పోలీసులు (Railway Police) తెలిపిన వివరాల ప్రకారం..
మహబూబాబాద్ (Mahabubabad) కు చెందిన గొల్లపల్లి రవితేజ, వరంగల్ కు చెందిన మోతిపట్ల సుమన్ టికెట్ లేకుండా అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (Navjeevan SF Express) రైలును ఎక్కారు. అయితే వారు టికెట్ తీసుకోకుండా వరంగల్ రైల్వే స్టేషన్ (Warangal Railway Sation)లో రైలు ఎక్కి ఎస్ -1 బోగిలో ప్రయాణిస్తున్నారు. తనిఖీల సందర్భంగా టీసీ కిరణ్ కుమార్ అందరి టికెట్లు అడుగుతున్నాడు. ఈ క్రమంలో రవితేజ, సుమన్ లను టికెట్లు అడగ్గా లేవని సమాధానం ఇచ్చారు. టికెట్ లేకుంటే జరిమానా చెల్లించాలని కిరణ్ కుమార్ ఆదేశించాడు. తాము చెల్లించమని ఆ యువకులు చెప్పడంతో వాగ్వాదం మొదలైంది.
ఈ సమయంలో వారి మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆవేశానికి లోనైన రవితేజ టీసీపై దాడికి పాల్పడ్డాడు. పిడిగుద్దులు గుద్దుతూ విచక్షణా రహితంగా కొట్టాడు. దాడిలో టీసీ కిరణ్ కుమార్ గాయపడ్డాడు. వెంటనే రైల్వే పోలీసులు స్పందించి మహబూబాబాద్ లో రైలును ఆపేశారు. కిరణ్ కుమార్ ను స్థానికంగా ఆస్పత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడిన రవితేజను పోలీసులు అరెస్ట్ చేయగా.. సుమన్ భయంతో పారిపోయాడు. వారిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై భాస్కర్ రావు తెలిపారు.