»Twitter Video App Video App From Twitter Coming Soon
Twitter Video App: త్వరలో ట్విట్టర్ నుంచి వీడియో యాప్
యూట్యూబ్ కు పోటీగా ట్విట్టర్ సరికొత్త ప్రయోగం చేయనుంది. త్వరలోనే ట్విట్టర్ వీడియో యాప్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ వెల్లడించారు.
ఈ రోజుల్లో యూట్యూబ్(Youtube) చూడని వారంటూ ఎవ్వరూ ఉండదరు. వీడియో పబ్లిషింగ్ సైట్(Video Publishing site)గా యూట్యూబ్ ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది. 18 ఏళ్ల కిందట ఈ యూట్యూబ్ అందరికీ పరిచయం అయ్యింది. ఎంట్రీ ఇస్తూనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. అటు వీక్షకులకు విజ్ఞానం, వినోదం అందిస్తూ ఇటు కంటెంట్ మేకర్స్ (Content Makers)కు మంచి ఆదాయాన్ని అందిస్తోంది.
అన్ని వర్గాలకు తగిన వీడియో వేదికగా యూట్యూబ్(Youtube) నిలిచింది. అంతేకాకుండా యూట్యూబ్ యాప్(App)గా కూడా మారిపోయి స్మార్ట్ ఫోన్ల(Smart Phones)లో, స్మార్ట్ టీవీల్లో అందరికీ అందుబాటులో నిలిచింది. ఇప్పుడు అదేవిధంగా ట్విట్టర్(Twitter) కూడా మారనుంది. ట్విట్టర్ కూడా వీడియో యాప్(twitter Video App)ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్(Twitter) యజమాని ఎలాన్ మస్క్(Elone Musk) ఈ విషయంపై తాజాగా కీలక ప్రకటన చేశారు. స్మార్ట్ టీవీ(Smart TV’s)ల కోసం ట్విట్టర్ వీడియో యాప్(twitter Video App)కు రూపకల్పన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఎక్కువ నిడివి ఉండే వీడియోను ఫోన్లలో చూడటం చాలా కష్టంగా ఉంది. అందుకే ట్విట్టర్ వీడియో యాప్ ద్వారా స్మార్ట్ టీవీల్లో పెద్ద వీడియోలను సులభంగా వీక్షించే అవకాశం ఉంది. ట్విట్టర్లో ఇప్పుడు 2 గంటల నిడివి ఉండే వీడియోను పోస్టు చేసే అవకాశం ఉంది. ఈ ఫీచర్ను గత నెలలోనే ట్విట్టర్ అందుబాటులోకి తెచ్చింది.