VZM: ఎస్.కోట పట్టణ కేంద్రం వన్ వే జంక్షన్ వద్ద వర్తకులు రోడ్డుకు రెండువైపులా స్థలాలు ఆక్రమించుకొని దుకాణాలు నిర్వహిస్తుండంతో ట్రాఫిక్ స్తంభించిపోతుంది. దీంతో వాహనాలు బారులు తీరడంతో పట్టణ సీఐ వి.నారాయణమూర్తి చర్యలు చేపట్టారు. బుధవారం సీఐ పర్యవేక్షణలో ఆక్రమణలను జెసిబి సహాయంతో తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తీరు మారకపోతే చర్యలు తప్పవన్నారు.