»Tuni Train Fire Case Dismissed By Vijayawada Railway Court
Tuni రైలు దగ్దం కేసులో ముద్రగడకు ఊరట.. కేసు కొట్టివేసిన రైల్వే కోర్టు
తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు (vijayawada railway court) కొట్టివేసింది. ఈ కేసును రైల్వే పోలీసులు సరిగా విచారించలేదని పేర్కొంది. 2016 జనవరి 30వ తేదీన కాపు నాడు సభ సమయంలో రైలు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఎనిమిదిన్నర ఏళ్ల తర్వాత కేసులో సరైన సాక్ష్యాలు చూపించలేదని కేసు కొట్టివేసింది.

తీర్పు వెలువరించే సమయంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం (mudragada padmanabham), దాడిశెట్టి రాజా (dhadishetty raja), నటుడు జీవా (jeeva) కోర్టు ప్రాంగణంలో ఉన్నారు. వీరితోపాటు 41 మంది నిందితులుగా ఉన్నారు. కేసు విచారణలో సరైన వాదనలు లేకపోవడం.. సాక్ష్యాలు చూపకపోవడంతో కొట్టి వేస్తున్నట్టు పేర్కొంది. కోర్టు తీర్పును కాపు సంఘం నేతలు స్వాగతించారు.
కేసు విచారణను ముగ్గురు రైల్వే అధికారులు (railway officials) సరిగా చేయలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. సున్నితమైన అంశాన్ని ఐదేళ్లపాటు ఎందుకు సాగతీశారని అడిగింది. ఈ సమయంలో సాక్ష్యులను ప్రవేశ పెట్టలేదని పేర్కొంది. రైలులో అంతమంది ప్రయాణిస్తుంటో ఎక్కువ మందిని విచారించలేదని తెలిపింది.
ఒకతనని రైలులో (rail) ప్రయాణించాడని కోర్టులో సాక్షింగా ప్రవేశపెట్టారని.. అతను మాత్రం జర్నీ చేయలేదని చెప్పాడని ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో ఆధారాలు లేకపోవడంతో 41 మందిపై అక్రమ కేసుగా పరిగణించి కొట్టి వేస్తున్నట్టు తెలిపింది. పోలీసులు (police) ఫైల్ చేసిన కేసులను కూడా ప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెలిసిందే.