»Tspsc Key Instructions For Telangana Group 1 Preliminary Exam Candidates
Telangana Group1: అభ్యర్థులకు TSPSC కీలక సూచనలు
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈనెల 11న రాసే అభ్యర్థులకు TSPSC కీలక సూచనలు చేసింది. పరీక్ష రోజు ఉదయం 10.15 గంటలకు పరీక్షా కేంద్రంలోకి హాజరు కావాలని కోరారు. ఆ తర్వాత గేట్లు మూసివేస్తామని వెల్లడించారు.
తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి TSPSC కీలక ప్రకటన చేసింది. పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసివేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 10.15 గంటల తర్వాత అభ్యర్థులను అనుతించబోమని వెల్లడించారు. ఎందుకంటే గుర్తింపు కార్డు, హాల్ టిక్కెట్‌ను ధృవీకరించడంతోపాటు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వారిని రూములలోకి అనుమతిస్తామని అన్నారు. ఈనెల 11న ఎగ్జామ్ జరగనుండగా..ఈ మేరకు TSPSC పలు సూచనలు చేసింది. దీంతోపాటు ఓఎంఆర్ పత్రంలో ఎవరైనా తప్పులు చేసినా కూడా ఆ తర్వాత కొత్తది ఇవ్వలేమని పేర్కొన్నారు. OMR షీట్ లో అభ్యర్థుల వివరాలు బ్లూ పెన్ లేదా బ్లాక్ పెన్ తో సరైన పద్ధతిలో బబ్లింగ్ చేయాలని సూచించారు. సరిగా బబ్లింగ్ చేయకున్నా కూడా అది పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.
ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టిక్కెట్ తోపాటు ఆధార్, పాన్ కార్డు తీసుకురావాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే అందుకు సంబంధించిన గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లెసెన్సు తదితర ఫొటోతో కూడిన ఐడీ కార్డులు తీసుకురావాలని వెల్లడించారు. వీటి విషయంలో ఎవరికీ కూడా మినహాయింపు లేదని అన్నారు. మరోవైపు ఎగ్జామ్ విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని తెలిపారు. దీంతోపాటు ఎగ్జామ్ రాయాలనుకున్న అభ్యర్థులు చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి వీలైనంత త్వరగా హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని TSPSC సూచించింది.