»Tough Competition In 2024 Us Presidential Election Biden And Trump Competition
2024 US presidential election: గట్టి పోటీ..బైడెన్, ట్రంప్ పోటీకి సై
అగ్రరాజ్యం అమెరికా 80 ఏళ్ల అధ్యక్షుడు జో బైడైన్ మళ్లీ వచ్చే ఎన్నికల్లో 2024లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ సైతం 2024 ఎలక్షన్లలో పోటీ చేస్తానని వెల్లడించారు.
80 ఏళ్ల ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(joe biden) కీలక ప్రకటన చేశారు. 2024లో కూడా తాను రెండోసారి వైట్ హౌస్ పదవీ కోసం పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే అత్యంత పురాతనమైన యుఎస్ ప్రెసిడెంట్ గా డెమొక్రాటిక్ అభ్యర్థిగా బెడైన్ రికార్డు సృష్టించడం విశేషం.
ఈ మేరకు బైడెన్ తన కొత్త ప్రచార బృందం విడుదల చేసిన వీడియోలో ఈ ప్రకటన చేశారు. వీడియోలో అతను అమెరికన్ ప్రజాస్వామ్యాన్ని రక్షించడం తన పని అని ప్రకటించాడు. దీంతోపాటు బైడెన్ రిపబ్లికన్ నేతలను అమెరికన్ స్వేచ్ఛకు బెదిరింపు దారులుగా అభివర్ణించారు. మహిళల ఆరోగ్య సంరక్షణను పరిమితం చేయడానికి, సామాజిక భద్రతను తగ్గించడం సహా MAGA తీవ్రవాదులను పేల్చే ప్రయత్నాలపై పోరాడతానని ప్రతిజ్ఞ చేశాడు.
MAGA అనేది ట్రంప్ యొక్క “మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్” రాజకీయ నినాదానికి సంక్షిప్త రూపం. ట్రంప్ (donald trump) కూడా ఇప్పటికే నవంబర్ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మళ్లీ పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో నాలుగేళ్ల పదవిని అమెరికన్లు ఎవరికీ కట్టబెడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.