»Dog Running Competition In Brahmotsavam At Wanaprthy Telangana
Dogs Running: బ్రహ్మోత్సవాల్లో కుక్కల రన్నింగ్ పోటీ
బ్రహ్మోత్సవాల్లో(Brahmotsavam) భాగంగా కొన్ని చోట్ల రథోత్సవం ఘనంగా జరుపుతారు. ఇంకొన్ని చోట్ల పలు రకాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ కుక్కల పరుగు(Dogs Running) పోటీలు(competition) నిర్వహించడం గురించి ఎక్కడైనా విన్నారా? లేదా అయితే ఈ వార్తను చదవేయండి మీకే తెలుస్తుంది.
సాధారణంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహిస్తారు. మరికొన్ని చోట్ల కోళ్ల పందాల పోటీలు, ఇంకొన్ని చోట్ల ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. కానీ వినూత్నంగా కుక్కల పరుగు పోటీలు(Dogs Running) నిర్వహించడం గురించి మీకు తెలుసా? లేదా అయితే ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
వనపర్తి జిల్లా(wanaprthy district) చిన్నతాండ్రపాడులో సత్యమాంబ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం కుక్కల రన్నింగ్ పోటీలను నిర్వహించారు. అంతేకాదు ఈ పోటీల్లో గెలిచిన వారికి బహుమతులను కూడా అందజేశారు. ఈ కాంపిటీషన్ కార్యక్రమంలో పాల్గొని గెలిచిన శునకాల యాజమానులకు(Dogs owners) మొదటి ప్రైజ్ రూ.10 వేలు రెండవ బహుమతిగా రూ.5 వేలు, మూడో ప్రైజ్ గా రూ.3 వేలను అందించారు. వినూత్నంగా నిర్వహించిన ఈ పోటీలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలిసింది.
అయితే ఆత్మకూరు పట్టణానికి చెందిన నరేష్ వారి ఆర్వీ డాగ్ ఫస్ట్ ప్రైజ్ గెల్చుకోగా..గద్వాల జిల్లా ఇందువాసి గ్రామానికి చెందిన నరసింహులుకు చెందిన లిక్కీడాగ్ సెకండ్ ప్రైజ్ గెల్చుకుంది. ఇక మూడో బహుమతిని బల్గెర ప్రాంతానికి చెందిన ఆంజనేయులు శునకం లైగర్ గెల్చుకుంది. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ సభ్యులు వారికి నగదు(cash) అందజేసి ప్రశంసించారు.
మరోవైపు ఇదివరకు జోగులాంబ గద్వాల జిల్లాలో భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర సందర్భంగా పందుల పోటీలు(pig competition) కూడా నిర్వహించారు. దౌదర్ పల్లి శివారులో పందులకు పోటీలు పెట్టారు. ఈ వేడుకల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 20 పందులు ఇందులో పాల్గొన్నాయి. ఏకలవ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన పందులకు బహుమతులు కూడా అందజేశారు. ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన పందుల యజమానులకు ప్రైజ్ మనీగా రూ.30,000, సెకండ్ ప్రైజ్ రూ.20,000, థర్డ్ ప్రైజ్గా రూ.10,000 ఇచ్చారు.