»Corona Active Cases Have Crossed 10 Thousand In The India March 27th 2023
Corona Cases: దేశంలో 10 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
భారతదేశం(India)లో గత 24 గంటల్లో 1,805 కొత్త కోవిడ్ కేసులు(covid cases) నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది. నిన్న 1,890 కేసులతో పోల్చితే కేసులు స్వల్పంగా తగ్గాయి. కానీ మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 10,300కు చేరింది. దీంతో 134 రోజుల తర్వాత మళ్లీ యాక్టివ్ కేసుల(active cases) సంఖ్య 10 వేలు దాటింది.
దేశంలో కరోనా కేసులు(corona cases) క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1,805 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల(active cases) సంఖ్య 10,300కి చేరింది. ఈ నేపథ్యంలో 134 రోజుల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య 10,000 మార్కును దాటిసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. మరోవైపు గత 24 గంటల వ్యవధిలో ఆరు మరణాలు నమోదు కాగా.. మృతుల(deaths) సంఖ్య కూడా 5,30,837కి పెరిగింది. ఇందులో కేరళలో రెండు మరణాలు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున రికార్డయ్యాయి. ఈ క్రమంలో కరోనా మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
ప్రస్తుతం దేశంలో (india)రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 932 మంది రికవరీ అయ్యారు. ఈ క్రమంలో మొత్తం రికవరీలు 4,41,64,815కి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు మొత్తం 220.65 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించబడ్డాయి. వీటిలో 95.20 కోట్లు రెండవ డోస్ కాగా, 22.86 కోట్ల మంది ప్రికాషన్ డోస్ తీసుకున్నారు. గత 24 గంటల్లో 1,743 మంది టీకాలు తీసుకున్నారు.
కరోనా కేసులు ప్రతి రోజు దాదాపు 1500కు పైగా నమోదవుతుండటం పట్ల కేంద్ర ప్రభుత్వం(central government) అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో COVID-19పై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ రోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు. ఆయా రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులతో కరోనా కట్టడి చర్యల గురించి చర్చించనున్నారు.
అంతకుముందు ఆదివారం 1,890 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇన్ఫ్లుఎంజా కేసులతో పాటు కరోనా కేసులు(corona cases) కూడా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని వైద్యులు సూచించారు. ఇన్ఫ్లుఎంజా వైరస్ లక్షణాల్లో భాగంగా అధిక జ్వరం, ఓళ్లు నొప్పులు, వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తపోటు, అతిసారం వంటివి ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకుని ఆస్పత్రుల్లో చేరాలని వెల్లడించారు.