»Today Ipl 2023 Qualifier 1 Csk Vs Gt Gujarat Team Is The Favorite
IPL 2023: నేడు క్వాలిఫైయర్ 1లో ఫేవరెట్ ఇదే..CSK vs GT
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నేడు IPL 2023 క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో 4 సార్లు మాజీ విజేత అయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుతో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT)తో తలపడనుంది. అయితే ఈ జట్టులో ఫేవరెట్ టీం ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 క్వాలిఫైయర్ 1లో గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు మే 23న చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. అయితే ఈ పోటీలో గెలిచిన జట్టు నేరుగా ఆదివారం జరిగే IPL 2023 ఫైనల్‌కి చేరుకుంటుంది.
ఓడిపోయిన జట్టు తమ ఫైనల్ బెర్త్‌ను బుక్ చేసుకోవడానికి మరో టీంతో తలపడనుంది. అయితే వారు శుక్రవారం క్వాలిఫైయర్ 2లో ఆడటానికి ముందు.. బుధవారం జరిగే లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేత కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ సీజన్లో వరుస సెంచరీలతో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తోపాటు పలువురు కీలక ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో గుజరాత్ జట్టు ప్రస్తుతం ఫేవరెట్ గా మారింది.
ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్లో కూడా టైటిల్ గెలవాలని చూస్తుంది. జీటీ ఇప్పటివరకు తమ 14 గేమ్‌లలో 10 గెలిచి, నాలుగింటిలో ఓడిపోయి 20 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో GT కంటే కేవలం ఒక స్థానం దిగువన CSK 17 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. చెన్నై జట్టు 14 గేమ్‌లలో ఎనిమిది గెలిచి ఐదు ఓడిపోయింది.
మరోవైపు ఇప్పటివరకు GT vs CSK హెడ్-టు-హెడ్ మూడు మ్యాచుల్లో తలపడగా.. గుజరాత్ టైటాన్స్ ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ క్రమంలో ఈరోజు జరిగే మ్యాచులో ఎవరో గెలుస్తారో చూడాలి. మీరు ఏ జట్టు గెలుస్తుందని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.