Charan-NTR: అప్పుడు చరణ్, ఇప్పుడు ఎన్టీఆర్ మిస్…ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది?
ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆస్కార్ వేడుకల సమయంలో మాత్రమే చివరగా.. ఎన్టీఆర్(NTR), చరణ్(ram charan)ని ఒకే ఫ్రేమ్‌లో చూశాం. పబ్లిక్‌గా ఈ ఇద్దరు కలుసుకున్నది ఆస్కార్ ఈవెంట్లోనే. మళ్లీ ఈ ఇద్దరు కలిసే ఛాన్స్ ఉన్నప్పటికీ.. ఒకరు పార్టీకి వస్తే.. ఇంకొకరు డుమ్మా కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అసలు చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు రీసెంట్గా జరిగిన పార్టీలలో ఎందుకు కనిపించలేదు? ఒకవేళ కలిస్తే మాత్రం మెగా, నందమూరి ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యేవారు. కానీ అలా జరగలేదు. ఒక్క ఆర్ఆర్ఆర్ పార్టీ అనే కాదు.. బర్త్ డే పార్టీలకు కూడా చరణ్(ram chran), తారక్(NTR) అటెండ్ అవలేదు. చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌కి ఇండస్ట్రీ ప్రముఖులంతా అటెండ్ అయ్యారు. కానీ ఎన్టీఆర్ వెళ్లలేదు. ఇక రీసెంట్గా ఎన్టీఆర్ ఇంట్లో జేమ్స్ ఫారెల్ రాకతో జరిగిన పార్టీకి చరణ్ వెళ్లలేదు. అలాగే లక్ష్మిప్రణతి పుట్టిన రోజు వేడుకలకి కూడా చరణ్ హాజరు కాలేదు. ఇక ఇప్పుడు జరిగిన పార్టీకి చరణ్ వచ్చాడు.. కానీ ఎన్టీఆర్ రాలేదు.
ట్రిపుల్ ఆర్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ టీమ్ మొత్తానికి ప్రత్యేకంగా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి రాజమౌళి, కీరవాణి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. వీరితో పాటు ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు వచ్చారు. రామ్ చరణ్ కూడా అటెండ్ అయ్యాడు. కానీ ఎన్టీఆర్(NTR) మాత్రం హాజరు కాలేదు. దీంతో అసలు చరణ్(charan), ఎన్టీఆర్(NTR) ఇద్దరు కలిసి పార్టీలకు ఎందుకు రావడం లేదనేది అర్థం కానీ విషయమే.
ఇద్దరి మధ్య దూరం పెరిగిందా? అనే డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇద్దరికీ ఉన్న కమిట్మెంట్స్ కారణంగా కలవలేని పరిస్థితిలో ఉన్నా.. ఇన్ని పార్టీలు మిస్ అవడం మాత్రం హాట్ టాపికే. మరి చరణ్, తారక్ కలిసి రూమర్స్‌కు చెక్ పెడతారేమో చూడాలి.