»The Kantara Movie That Is Fast Approaching Releasing In Italian And Spanish Languages Too
Kantara: దూసుకెళ్తున్న కాంతారా మూవీ..ఇటాలియన్, స్పానిష్ భాషల్లో కూడా రిలీజ్
రిషబ్ శెట్టి యాక్ట్ చేసిన కాంతారా మూవీ(Kantara movie) గత ఏడాది విడుదలైనప్పటికీ ఇంకా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం కూడా పలు భాషల్లో విడుదల అవుతూ మరింత మంది అభిమానులకు దగ్గరవుతుంది. ఇప్పటికే ఇటీవల ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో భాగంగా కాంతారా చిత్రాన్ని ప్రదర్శించారు. తాజాగా ఇటాలియన్, స్పానిష్ భాషల్లో కూడా కాంతారా(Kantara) చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
రిషబ్ శెట్టి(Rishab Shetty) యాక్ట్ చేసిన కాంతారా మూవీ(Kantara movie) గత ఏడాది విడుదలైనప్పటికీ ఇంకా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం కూడా పలు భాషల్లో విడుదల అవుతూ మరింత మంది అభిమానులకు(fans) దగ్గరవుతుంది. ఇప్పటికే ఇటీవల ఐక్యరాజ్యసమితి(UNO) కార్యక్రమంలో భాగంగా కాంతారా చిత్రాన్ని ప్రదర్శించారు. తాజాగా ఇటాలియన్, స్పానిష్ భాషల్లో కూడా కాంతారా(Kantara) చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి భారీ డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ సినిమాను ఇతర భాషల్లోకి రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది తెలిసిన కంతారా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. చిన్న చిత్రంగా వచ్చి..అంతర్జాతీయ స్థాయిలో డబ్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాంతారా బ్యాక్‌స్టోరీని తెరకెక్కిస్తున్నప్పుడు ప్రేక్షకులకు చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయని హోంబలే మేకర్స్ అన్నారు. కాంతారా కంటే ప్రిక్వెల్ ఇంకా గ్రాండ్‌గా ఉండబోతోందని స్పష్టం చేశారు. రూ.16 కోట్ల బడ్జెట్ తో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాంతారా(Kantara) బ్లాక్ బాస్టర్ హిట్ సాధించడంతో అనేక భాషల్లో కలిపి దాదాపు రూ.450 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. సెప్టెంబర్ 30, 2022న విడుదలైన ఈ చిత్రానికి రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించి..తానే హీరోగా నటించగా, హోంబలే ఫిలింస్ ఈ సినిమాను నిర్మించింది.
ఇప్పటికే స్టార్ మా(star maa)లో ప్రసారం అయిన ఈ సినిమాకు 12.35 రేటింగ్ రావడంతో మరోసారి రికార్డు క్రియేట్ చేసింది. ఈ మధ్యకాలంలో తెలుగు స్ట్రెయిట్ సినిమాల టీఆర్పీలు దాదాపు పదిలోపే వస్తున్నాయి. అలాంటిది కాంతారా సినిమాకు అత్యధిక టీఆర్పీ(TRP) నమోదైంది. చిరు గాడ్‌ఫాదర్ కూడా కేవలం 7.69 టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. కాంతారా 12.35 టీఆర్పీ రేటింగ్‌తో అటు వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ప్రభంజనం సృష్టించింది.