Bommai, Rishab Shetty spotted together in Kollur temple
Bommai, Rishab Shetty:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం మీద కాస్త వ్యతిరేకత ఉంది. అందుకే ఆ పార్టీ సినీ తారలపై ఫోకస్ చేసింది. కమల దళం తరఫున ప్రచారం చేస్తానని ఇప్పటికే కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ (sudeep) ప్రకటించారు. ఇప్పుడు రిషబ్ శెట్టి (rishab shetty) కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైతో (basavaraju bommai) కలిసి కనిపించారు. దీంతో ఆయన కూడా బీజేపీ తరఫున ప్రచారం చేస్తారా అనే సందేహాం వస్తోంది.
బొమ్మై- శెట్టి కలిసింది క్యాజువల్ మీట్ కాదు.. ఓ ఆలయంలో (temple) కలిశారు. ఉడుపిలో గల కొల్లూరు మూకంబిక ఆలయంలో మీట్ అయ్యారు. భేటీ గురించి మీడియా ప్రతినిధులు అడగగా.. ఆలయంలో అనుకోకుండా కలిశామని బొమ్మై (bommai) తెలిపారు. బీజేపీ (bjp) తరఫున ప్రచారం చేయమని అడగలేదని పేర్కొన్నారు. తామిద్దరి విధానాలు వేరు అని స్పష్టం చేశారు. తాను ఇక్కడికి రాకముందే రిషబ్ శెట్టి (rishab shetty) ఆలయంలో ఉన్నాడని బొమ్మై వివరించారు.
రిషబ్ శెట్టి ఈ మార్చిలో బొమ్మైను కలిశారు. బందిపూర్, నాగర్ హోల్ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల గురించి చర్చించారు. రిషబ్ శెట్టితోపాటు యష్ (yash) కూడా ప్రచారం చేయాలని పార్టీలు కోరాయి. వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారని కన్నడ మీడియా పేర్కొంది.
ఇటు బొమ్మై సిగ్గావ్ నియోజకవర్గంలో రేపటి నుంచి కిచ్చ సుదీప్ (sudeep) ప్రచారం చేస్తారు. ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడంలో బిజీగా ఉన్నారు. నామినేషన్లు ఫైల్ చేసేందుకు ఆఖరు తేదీ ఈ నెల 20 కాగా.. వచ్చే నెల 10వ తేదీన ఓకే విడతలో ఎన్నిక జరగనుంది. 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.